పెంపుడు పక్షిని వదిలేసినందుకు.. ఏడేళ్ల పాపను దారుణంగా..

ABN , First Publish Date - 2020-06-05T03:44:25+05:30 IST

మనుషులు రోజురోజుకూ క్రూరంగా మారుతున్నారు. పాకిస్థాన్‌లో ఏడేళ్ల పాపను

పెంపుడు పక్షిని వదిలేసినందుకు.. ఏడేళ్ల పాపను దారుణంగా..

ఇస్లామాబాద్: మనుషులు రోజురోజుకూ క్రూరంగా మారుతున్నారు. పాకిస్థాన్‌లో ఏడేళ్ల పాపను భార్యాభర్తలు దారుణంగా హత్యచేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇస్లామాబాద్ సమీపంలోని రావల్‌పిండి ప్రాంతంలో హస్సాన్ సిద్దిఖి తన కుటుంబంతో కలిసి జీవిసిస్తున్నాడు. సిద్దిఖి, తన భార్య తమ ఏడేళ్ల కుమారుడి బాగోగులు చూసుకోవడానికి ఏడేళ్ల పాపను పనిలో పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏడేళ్ల పాప ఇంట్లో ఉన్న నాలుగు పెంపుడు మకావ్ చిలుకల్లో ఒక చిలుకను గాల్లోకి వదిలేసింది. దీంతో సిద్దిఖి, అతడి భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. చిన్నపాప అని కూడా చూడకుండా సిద్దిఖి పాప పొత్తికడుపులో కొట్టాడు. దీంతో పాప స్పృహ తప్పింది. పాపను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు.  ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పాప హత్యకు కారణమైన సిద్దిఖి, అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లో పిల్లలతో కలిపి మొత్తంగా 85 లక్షల మంది.. ఇళ్లల్లో పనిచేస్తున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. చట్టం ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. కాగా.. పాప మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. పాకిస్థాన్‌లో మైనర్ పిల్లలపై ఈ రకంగా అనేక దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-06-05T03:44:25+05:30 IST