గుహలో దాక్కున్న విదేశీయులు.. క్వారంటైన్‌కు తరలించిన అధికారులు

ABN , First Publish Date - 2020-04-22T03:07:51+05:30 IST

పోలీసుల కళ్లుగప్పి గుహలో దాక్కుంటూ వచ్చిన ఆరుగురు విదేశీయులను

గుహలో దాక్కున్న విదేశీయులు.. క్వారంటైన్‌కు తరలించిన అధికారులు

రిషికేశ్: పోలీసుల కళ్లుగప్పి గుహలో దాక్కుంటూ వచ్చిన ఆరుగురు విదేశీయులను అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. రిషికేశ్‌ సమీపంలో ఉన్న స్వర్గ ఆశ్రమంలో వీరంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆరుగురిలో నలుగురు అబ్బాయిలు కాగా.. ఇద్దరు అమ్మాయిలని అధికారులు వెల్లడించారు. వీరంతా అమెరికా, ఫ్రాన్స్, ఉక్రెయిన్, టర్కీ, నేపాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. మార్చి 24 నుంచి వీరంతా గుహలో నివసిస్తున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. కేంద్రం లాక్‌డౌన్ విధించక ముందు వీరంతా హోటల్‌లో ఉన్నట్టు, డబ్బులు అయిపోవడంతో గుహకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఉన్న కాస్త డబ్బులతో కడుపు నింపుకుంటూ వస్తున్నట్టు అధికారులకు తెలియజేశారు. కాగా, భారత ప్రభుత్వం మార్చి 24న 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించడం, ఆ తర్వాత మే 03 వరకు పొడిగించడం తెలిసిన విషయమే.

Updated Date - 2020-04-22T03:07:51+05:30 IST