‘వందే భారత్ మిషన్’లో భాగంగా నిన్న ఒక్కరోజే..!

ABN , First Publish Date - 2020-07-12T22:33:21+05:30 IST

కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భా

‘వందే భారత్ మిషన్’లో భాగంగా నిన్న ఒక్కరోజే..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భాగంగా నిన్న ఒక్క రోజే సుమారు 5,746 మంది భారతీయులు స్వదేశానికి చేరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరి.. ట్విట్టర్‌లో వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా షార్జా, బహ్రెయిన్, మస్కట్, దుబాయ్, కౌలాలంపూర్, న్యూయార్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్, సింగపూర్, దోహా, టొరంటో తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న  దాదాపు 5,746 మంది భారతీయులు శనివారం రోజు  ఇండియాకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించింది. జూలై 3 నుంచి నాలుగో విడత ‘వందే భారత్ మిషన్’ప్రారంభమైంది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 


Updated Date - 2020-07-12T22:33:21+05:30 IST