హైదరాబాద్ చేరుకున్న 555 మంది ప్రవాసులు
ABN , First Publish Date - 2020-06-22T13:44:13+05:30 IST
వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆదివారం వివిధ దేశాల నుంచి 555 మంది ప్రయాణికులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు

శంషాబాద్ రూరల్, జూన్ 21: వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆదివారం వివిధ దేశాల నుంచి 555 మంది ప్రయాణికులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వీడన్ నుంచి 135, న్యూజిల్యాండ్ నుంచి 97, నిగేరియా నుంచి 180, జర్మనీ నుంచి 142 మంది ప్రయాణికులు హైదరాబాద్ చేరుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా విమానాల సర్వీసులు ప్రారంభమయ్యే వరకు వందే భారత్ మిషన్ కొనసాగుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.