‘నన్నే ప్రశ్నిస్తారా..? మీపై ఐక్యరాజ్య సమితిలో కేసు వేస్తా..’

ABN , First Publish Date - 2020-06-23T21:09:51+05:30 IST

‘నన్నే పోలీస్ స్టేషన్ కు పిలుస్తారా..? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు..? ఎవరో ఏదో ఫిర్యాదు చేస్తే.. నన్ను ప్రశ్నిస్తారా..? మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్..

‘నన్నే ప్రశ్నిస్తారా..? మీపై ఐక్యరాజ్య సమితిలో కేసు వేస్తా..’

దుబాయి: ‘నన్నే పోలీస్ స్టేషన్ కు పిలుస్తారా..? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు..? ఎవరో ఏదో ఫిర్యాదు చేస్తే.. నన్ను ప్రశ్నిస్తారా..? మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్.. మీపై ఐక్యరాజ్య సమితిలో కేసు వేస్తా..‘ అంటూ ఓ వ్యక్తి దుబాయి పోలీసులను దుర్భాషలాడాడు. నోటికొచ్చినట్లు తిట్టాడు.. పోలీసులపై ఫైల్స్ ను విసిరివేశాడు. అతడి ప్రవర్తనకు విసుగు చెందిన పోలీసులు.. అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ ఓ దుబాయి మహిళ.. ఓ 54 ఏళ్ల అరబ్ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని దుబాయిలోని క్రిమినల్ కోర్టుకు పిలిపించి విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఎదుటే అతడిని ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతడు సమాధానాలు చెప్పకపోగా.. తిరిగి పోలీసులనే దూషించడం మొదలు పెట్టాడు. పోలీసులపై ఐక్యరాజ్య సమితిలో కేసు వేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పెట్టిన కేసుతో పాటు.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషించడంపై కూడా మరో కేసును పోలీసులు నమోదు చేశారు.   

Read more