కువైట్లో హోం క్వారంటైన్ ఉల్లంఘించే ప్రవాసులకు...
ABN , First Publish Date - 2020-08-12T20:25:51+05:30 IST
కువైట్ వచ్చిన తర్వాత ప్రవాసులు ఎవరైనా హోం క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి మూడు నెలలకు మించకుండా జైలు, 5వేల కువైటీ దిర్హమ్స్(రూ.12,22,398) జరిమానా లేదా రెండు విధించేటట్లు తాజాగా అక్కడి సర్కార్ కొత్తగా చట్ట సవరణలు చేసింది.

కువైట్ సిటీ: కువైట్ వచ్చిన తర్వాత ప్రవాసులు ఎవరైనా హోం క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి మూడు నెలలకు మించకుండా జైలు, 5వేల కువైటీ దిర్హమ్స్(రూ.12,22,398) జరిమానా లేదా రెండు విధించేటట్లు తాజాగా అక్కడి సర్కార్ కొత్తగా చట్ట సవరణలు చేసింది. సంక్రమణ వ్యాధులను నివారించడానికి ఆరోగ్య జాగ్రత్తలు మరియు దాని సవరణలకు సంబంధించి 1969లో తీసుకొచ్చిన 8వ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, కరోనా మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో కువైట్ సర్కార్ ఈ సవరణలు చేసింది. కనుక వలసదారులు కువైట్ వచ్చిన తర్వాత స్వీయ, సమాజ ఆరోగ్య భద్రత కోసం హోం క్వారంటైన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ఇక ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్.. అటు కువైట్లో కూడా తన ప్రాబల్యాన్ని చాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 73,068 మందికి ప్రబలింది. 486 మందిని బలిగొంది.