కరోనా సోకి ఐదేళ్ల బాలుడు మృతి.. ఇంగ్లాండ్‌లో..
ABN , First Publish Date - 2020-04-05T08:03:49+05:30 IST
కొవిడ్-19 యూరప్ దేశాలను వణికిస్తోంది. నిత్యం వందల మంది కరోనా కారణంగా మ
లండన్: కొవిడ్-19 యూరప్ దేశాలను వణికిస్తోంది. నిత్యం వందల మంది కరోనా కారణంగా మరణిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా.. ఇంగ్లాండ్‌లో ఐదేళ్ల బాలుడు కరోనా సోకి మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. యూకేలో ఎక్కువగా వృద్దులే మరణిస్తున్నట్టు వార్తలొస్తున్నప్పటికి.. చిన్న వయసు వారు కూడా ఇటీవలి రోజుల్లో చనిపోతున్నారు. కరోనా సోకి యువకులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వీరిలో చాలా మందికి ఎటువంటి రోగాలు కూడా లేవని చెబుతోంది. శనివారం ఇంగ్లాండ్ వ్యాప్తంగా 637 మంది చనిపోయారు. వీరిలో 104 ఏళ్ల వయసున్న పేషంట్, ఐదేళ్ల బాలుడు ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3,939కి చేరింది. యూకే వ్యాప్తంగా ఈ సంఖ్య 4,313కి పెరిగింది. తాజా లెక్కలను చూస్తే ఇటలీ కంటే వేగంగా యూకేలో మరణాల సంఖ్య పెరుగుతూ వెళ్లిపోతోంది. మరోపక్క యూకేలో వెంటిలేటర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికే యూకే ప్రభుత్వం నిత్యం వందల వెంటిలేటర్లను తయారుచేస్తోంది. మరోపక్క విదేశాల నుంచి కూడా వందల వెంటిలేటర్లను కొనుగోలు చేస్తోంది.