న్యూజెర్సీలో కరోనా కాటుకు 4ఏళ్ల చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2020-05-09T17:26:31+05:30 IST

కరోనా మహమ్మారి కాటుకు 4ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కొద్ది రోజుల క్రితం నాలుగెళ్ల చి

న్యూజెర్సీలో కరోనా కాటుకు 4ఏళ్ల చిన్నారి మృతి!

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కాటుకు 4ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం నాలుగెళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. దీంతో కుటుంబ సభ్యులు.. ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్‌లో చికిత్స పొందతూ శుక్రవారం రోజు ఆ చిన్నారి మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కరోనా మరణాలపై న్యూజెర్సీ గవర్నర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 4ఏళ్ల చిన్నారి మరణాన్ని ఉద్దేశిస్తూ.. కరోనా కాటుకు 18ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు చనిపోవడం న్యూజెర్సీ రాష్ట్రంలో ఇదే ప్రథమం అన్నారు. అయితే ఆ చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఆయన బయట పెట్టలేదు. కాగా.. కరోనా కారణంగా ఇప్పటి వరకు న్యూజెర్సీలో 8,986 మంది మరణించారు. 1.37లక్షల మందికి వైరస్ సోకింది. ఇదిలా ఉంటే అమెరికాలో 13.22 లక్షల మందికి వైరస్ సోకగా.. 78వేల మంది మరణించారు. 


Updated Date - 2020-05-09T17:26:31+05:30 IST