ఘోరాతిఘోరం.. మనుషుల నిర్లక్ష్యానికి 4వేల మూగ జీవాలు బలి

ABN , First Publish Date - 2020-10-03T11:46:30+05:30 IST

చైనాలో దారుణం జరిగింది. ఓ షిప్పింగ్‌ కంపెనీ నిర్లక్ష్యం నాలుగు వేల మూగ జీవాలను బలితీసుకుంది.

ఘోరాతిఘోరం.. మనుషుల నిర్లక్ష్యానికి 4వేల మూగ జీవాలు బలి

బీజింగ్‌, అక్టోబరు 2: చైనాలో దారుణం జరిగింది. ఓ షిప్పింగ్‌ కంపెనీ నిర్లక్ష్యం నాలుగు వేల మూగ జీవాలను బలితీసుకుంది. ఈ ఘటన స్థానిక హెనాన్‌ ప్రావిన్స్‌లోని లౌహే నగరంలో జరిగింది. వారం క్రితం చైనా జంతు పరిశ్రమ.. 5 వేల కుక్కలు, పిల్లులు, కుందేళ్లు లాంటి పెంపుడు జంతువులను ప్లాస్టిక్‌, కార్డ్‌బోర్డ్‌ పెట్టెల్లో పార్శిల్‌ చేసి డాంగ్జిం గ్‌ లాజిస్టిక్స్‌కు పంపించింది. వీటిని చైనీయులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. డాంగ్జింగ్‌ సంస్థ వాటిని సకాలంలో డెలివరీ చేసున్నా.. అందులో మూగజీవాలున్నట్లు ఆ షిప్పింగ్‌ సంస్థకు జంతు పరిశ్రమ సమాచారం అందించి ఉన్నా.. పా పం వాటి ప్రాణాలు నిలబడి ఉండేవి. డెలివరీలో జరిగిన జాప్యంతో.. వారం పాటు ఆ పార్శిళ్లు షిప్పింగ్‌ సంస్థలోనే ఉం డిపోయాయి. దీంతో.. తిండిలేక.. ఊపిరాడక.. విలవిల్లాడిపోయిన ఆ మూగ జీవాలు.. మనుషుల నిర్లక్ష్యం సాక్షిగా ప్రాణాలు విడిచాయి. 

Updated Date - 2020-10-03T11:46:30+05:30 IST