130రోజులపాటు పోరాటం చేసి.. మహమ్మారిని జయించిన బ్రిటన్ మహిళ!

ABN , First Publish Date - 2020-07-20T04:03:43+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల మహిళ దాదాపు 130రోజులు కరోనాతో పోరాటం చేసి, మహమ్మారి

130రోజులపాటు పోరాటం చేసి.. మహమ్మారిని జయించిన బ్రిటన్ మహిళ!

బ్రిటన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల మహిళ దాదాపు 130రోజులు కరోనాతో పోరాటం చేసి, మహమ్మారిని జయించారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన 35ఏళ్ల ఫాతిమా.. మొరాకో నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా.. కరోనా సోకినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఫాతిమా బ్రిటన్‌లోని సౌతాంప్టన్ జనరల్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. వెంటిలేటర్లపై ఉంచి ఆమెకు డాక్టర్లు వైద్యం అందించారు. దాదాపు 105రోజులపాటు వెంటిలేటర్లపైనే ఉండి చికిత్స పొందిన ఫాతిమా.. మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో డాక్టర్లు ఆమెను రికవరీ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో స్పందించిన ఆమె.. ‘ఇది ఒక కలలా అనిపిస్తుందంటూ’కోలుకోవడం గురించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2.94లక్షల మంది కరోనా బారినపడగా.. సుమారు 45వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-20T04:03:43+05:30 IST