బ్రెజిల్‌లో కరోనా క‌ల్లోలం.. ఒక్కరోజే 31వేల మందికి!

ABN , First Publish Date - 2020-06-06T13:24:05+05:30 IST

కరోనా వైరస్‌ బ్రెజిల్‌లో వణుకు పుట్టిస్తోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 31,392 కేసులు వెలుగు చూశాయి.

బ్రెజిల్‌లో కరోనా క‌ల్లోలం.. ఒక్కరోజే 31వేల మందికి!

ఆరు లక్షలు దాటేసిన కేసులు

రియో డి జనీరో, జూన్‌ 5: కరోనా వైరస్‌ బ్రెజిల్‌లో వణుకు పుట్టిస్తోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 31,392 కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,21,877కు చేరుకుంది. ఒక్కరోజులోనే 1,473 మంది మృతిచెందారు. దక్షిణాఫ్రికాలోనూ 3,267 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 40,792కి చేరుకున్నాయి. కొరియాలో ఇప్పటివరకు 11,668 కేసులు నమోదవగా.. 273 మంది మరణించారు. జపాన్‌లో కొవిడ్‌ మరణాలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కొత్త కేసులు, మరణాలు నమోదవలేదు. అయితే  భవిష్యత్తులో వైరస్‌ వ్యాప్తి ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-06-06T13:24:05+05:30 IST