బ్రిట‌న్‌ బ‌య‌ల్దేరిన 310 మంది ఎన్నారైలు !

ABN , First Publish Date - 2020-05-08T22:37:05+05:30 IST

లాక్‌డౌన్ వ‌ల్ల స్వ‌దేశంలో ఇరుక్కుపోయిన 310 మంది ఎన్నారైలు శుక్ర‌వారం ప్రత్యేక విమానంలో బ్రిట‌న్ బ‌ల్దేరి వెళ్లారు.

బ్రిట‌న్‌ బ‌య‌ల్దేరిన 310 మంది ఎన్నారైలు !

చంఢీగ‌ఢ్‌: లాక్‌డౌన్ వ‌ల్ల స్వ‌దేశంలో ఇరుక్కుపోయిన 310 మంది ఎన్నారైలు శుక్ర‌వారం ప్రత్యేక విమానంలో బ్రిట‌న్ బ‌ల్దేరి వెళ్లారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వీరంద‌రూ శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు యూకే బ‌య‌ల్దేరారు. దీంతో విమానాశ్ర‌యంలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పీపీఈ కిట్స్ ధ‌రించి ప్ర‌యాణికుల‌ను ప‌రీక్షించారు. థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌ నిర్వ‌హించడంతో పాటు ముఖాలకు మాస్కులు ధ‌రించ‌మ‌ని చెప్ప‌డం, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. నెల రోజులుగా క‌రోనా సంక్షోభం వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో స్వ‌దేశంలో చిక్కుకుపోయిన ఎన్నారైలు ఎట్ట‌కేల‌కు తిరిగి బ్రిట‌న్ వెళ్లేందుకు అవ‌కాశం ల‌భించ‌‌డంతో ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల ప్రభుత్వాల‌కు ఎన్నారైలు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. బ్రిట‌న్‌, భార‌త ప్ర‌భుత్వాల చొర‌వ‌తోనే తాము తిరిగి యూకే వెళ్లేందుకు మార్గం సుగ‌మ‌మైంద‌న్నారు. 

Updated Date - 2020-05-08T22:37:05+05:30 IST