మహిళా రోగులపై లైంగిక వేధింపులు.. యూకేలో భారత వైద్యుడికి 3 జీవిత ఖైదులు

ABN , First Publish Date - 2020-02-08T17:18:54+05:30 IST

బ్రిటన్‌లో భారత సంతతి వైద్యుడికి లండన్ కోర్టు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది.

మహిళా రోగులపై లైంగిక వేధింపులు.. యూకేలో భారత వైద్యుడికి 3 జీవిత ఖైదులు

బ్రిటన్‌లో భారత సంతతి వైద్యుడికి లండన్ కోర్టు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. తన వద్ద వైద్యం కోసం వచ్చిన 23 మంది మహిళలతో పాటు 15 ఏళ్ల బాలికపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత వైద్యుడికి న్యాయస్థానం ఈ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం... మనీష్ షా(50)అనే భారత సంతతి వైద్యుడు మావ్నీ మెడికల్ సెంటర్‌లో పని చేస్తున్న సమయంలో బ్రేస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళా రోగులపై తన వెకిలి చేష్టలతో వేధింపులకు పాల్పడ్డాడు. అవసరం లేకున్న మహిళలను స్కానింగ్ పేరిట లైంగిక వేధింపులకు గురి చేశాడు. వైద్యం పేరుతో మహిళల ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ శునకానందం పొందేవాడు. ఇలా 23 మహిళలతో సహా 15 ఏళ్ల మైనర్ పట్ల కూడా మనీష్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో 2018లో బాధితులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో మనీష్ బాధితుల్లో మరో 18 మంది మహిళలు ఉన్నట్లు తెలిసింది. గతేడాది ఈ కేసు లండన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో మనీష్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. శుక్రవారం అతనికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. రోగుల భయాన్ని అడ్డుపెట్టుకొని ఇలా అమానుషంగా ప్రవర్తించినందుకు మనీష్‌కు మూడు జీవిత ఖైదులు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 

Updated Date - 2020-02-08T17:18:54+05:30 IST