చైనాలో కుంభవృష్టి.. 2.4 కోట్ల ప్రజలకు తీరని నష్టం

ABN , First Publish Date - 2020-07-20T09:58:08+05:30 IST

చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. జూలై నెలలో ఇప్పటివరకు కురిసిన భారీ వరదలు

చైనాలో కుంభవృష్టి.. 2.4 కోట్ల ప్రజలకు తీరని నష్టం

బీజింగ్: చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. జూలై నెలలో ఇప్పటివరకు కురిసిన భారీ వరదలు దాదాపు 2.4 కోట్ల మందికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. జియాంగ్సి, అన్‌హుయ్, హుబే, హునాన్ ప్రావిన్స్‌లలో కురిసిన భారీ వరదల కారణంగా 20  లక్షల మందిని వేరే ప్రాంతాలకు తరిలించినట్టు మినిస్ట్రి ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎమ్ఈఎమ్) తెలిపింది. ఇప్పటివరకు లక్షా 51 వేలకు పైగా ఇళ్లు కూలిపోయాయని.. వరదల వల్ల 9.19 బిలియన్ డాలర్ల(రూ. 68,857 కోట్లు) నష్టం చేకూరినట్టు పేర్కొంది. జియాంగ్సీ, అన్‌హుయ్, హుబే, హునాన్ ప్రావిన్స్‌లలో భారీ వరదల వల్ల 31 మంది చనిపోవడం లేదా అదృశ్యమవడం జరిగినట్టు చెప్పింది. గత ఐదేళ్లతో పోల్చితే చనిపోయిన లేదా అదృశ్యమైన వారి సంఖ్య ఈ ఏడాది 82 శాతం తక్కువగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. మరోపక్క అన్‌హుయ్ ప్రావిన్స్‌లోని చుహే నదిపై ఉన్న డ్యామ్‌లో వరద నీరు వార్నింగ్ లెవల్‌ను కూడా దాటేసి ముంపు ప్రాంతాలను ముంచెత్తింది. ఇక వరద నీటిని వదిలేందుకు మరో మార్గం లేక ఆదివారం ఉదయం డ్యామ్‌ను అధికారులు బాంబులు పెట్టి కూల్చేశారు. ఈ ఏడాది చైనాలోని అనేక డ్యామ్‌లలో నీరు వార్నింగ్ లెవల్‌కు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-20T09:58:08+05:30 IST