సౌదీలో 5 రోజుల పాటు 24 గంటలు కర్ఫ్యూ..!
ABN , First Publish Date - 2020-05-24T14:17:05+05:30 IST
సౌదీ అరేబియాలో కల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. రంజాన్ పండుగా సందర్భంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే మరింతా ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రియాధ్: సౌదీ అరేబియాలో కల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. రంజాన్ పండుగా సందర్భంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే మరింతా ప్రబలే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం సాయంత్రం నుంచే దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధించారు. పండుగా జరుపుకునే ఐదు రోజుల పాటు( మే 27 వరకు) 24 గంటలు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రి తలాల్ అల్ షల్హౌబ్ తెలియజేశారు. దీనికోసం రక్షణ దళాలను రంగంలోకి దించుతున్నామని ఆయన పేర్కొన్నారు. జనాలు ఎవరూ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ చూస్తాయన్నారు. పండుగా రోజుల్లో కూడా ప్రజలు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. అత్యావసర పరిస్థితుల్లో 999కి కాల్ చేయొచ్చని తలాల్ తెలిపారు. అలాగే మక్కా ప్రాంతానికి చెందిన వారు మాత్రం 911 నెంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు. ఇదిలాఉంటే... సౌదీలో స్వైర విహారం చేస్తున్న కోవిడ్-19 ఇప్పటికే 70వేలకు పైగా మందికి సోకింది. 379 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.