నేపాల్‌కు పోటెత్తిన భారతీయులు!

ABN , First Publish Date - 2020-09-14T00:24:22+05:30 IST

ఈ ఏడాదిలో నేపాల్‌లో పర్యటించిన విదేశీయుల వివరాలను ఆ దేశ అధికారులు వెల్లడించారు. నేపాల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలి

నేపాల్‌కు పోటెత్తిన భారతీయులు!

ఖాట్మాండు: ఈ ఏడాదిలో నేపాల్‌లో పర్యటించిన విదేశీయుల వివరాలను ఆ దేశ అధికారులు వెల్లడించారు. నేపాల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8నెలల్లో సుమారు 1.77లక్షల మంది టూరిస్ట్‌లు నేపాల్‌ను సందర్శించారు. కాగా.. ఈ సంవత్సరంలో నేపాల్‌ను సందర్శించిన విదేశీయుల జాబితాలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 16వేల మందికిపైగా భారతీయులు నేపాల్‌‌లో పర్యటించారు. మార్చిలో వీరి సంఖ్య 6వేలకు పడిపోయింది. కొవిడ్ నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఏప్రిల్, మే నెలల్లో నేపాల్‌కు వెళ్లిన వారి సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ఏప్రిల్‌లో ఒకరు, మేలో ఎడుగురు భారత పౌరులు నేపాల్ వెళ్లారు. కాగా.. ఆంక్షలను భారత ప్రభుత్వం సడలించిన తర్వాత నేపాల్‌కు వెళ్లిన వారి సంఖ్య కాస్త పెరిగింది. 


Updated Date - 2020-09-14T00:24:22+05:30 IST