కరోనా కాటుకు సౌదీలో 11 మంది భారతీయులు మృతి

ABN , First Publish Date - 2020-04-24T17:15:55+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్రరాజ్యాల్లో సైతం తీవ్ర ప్రభావం చూపిస్తున్న మహమ్మారి.. ఎడారి దేశాల్లోనూ

కరోనా కాటుకు సౌదీలో 11 మంది భారతీయులు మృతి

రియాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్రరాజ్యాల్లో సైతం తీవ్ర ప్రభావం చూపిస్తున్న మహమ్మారి.. ఎడారి దేశాల్లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. కాగా.. సౌదీ అరేబియాలో కరోనా కాటుకు దాదాపు 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సౌదీ అరెబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు మీడియాకు వెల్లడించారు. మదినాలో నలుగురు, మక్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్దరు, రియాద్, దమ్మమ్‌లో ఒక్కరు చొప్పున మొత్తం 11 మంది భారతీయులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధికారులు.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రవాసులు సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 121 మంది కొవిడ్-19 కారణంగా మరణించారు. 


Updated Date - 2020-04-24T17:15:55+05:30 IST