కుర్దిస్థాన్‌లో చిక్కుకున్న పది వేల మంది తెలుగు వర్కర్లు .. పని కూడా లేక..

ABN , First Publish Date - 2020-04-21T22:23:17+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా కుర్దిస్థాన్ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పది వేల మంది తెలుగు కార్మికులు చేయడానికి పని లేక, తినడానికి

కుర్దిస్థాన్‌లో చిక్కుకున్న పది వేల మంది తెలుగు వర్కర్లు .. పని కూడా లేక..

ఎర్బిల్: కరోనా నియంత్రణలో భాగంగా కుర్దిస్థాన్ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పది వేల మంది తెలుగు కార్మికులు చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మార్చి 13నే ఆంక్షలను విధించడంతో నెలన్నర నుంచి తెలుగు వారికి ఉపాధి కరువైంది. విమాన రాకపోకలపై కూడా ఆంక్షలు ఉండటంతో స్వదేశానికి కూడా రాలేక ఇక్కట్లు పడుతున్నారు. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్‌లోనే నాలుగు నుంచి ఆరు వేల మంది తెలుగు వారు నివసిస్తున్నారు. వీరిలో అత్యధిక మంది నిర్మాణ రంగంలోనే పనిచేస్తూ వస్తున్నారు. రెండు నెలల నుంచి పనిలేదని.. ఇప్పుడప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే మార్గం కూడా కనిపించడం లేదని తెలుగు గల్ఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామచందర్ తెలిపారు. ఉపాధి లేని వారంతా స్వదేశానికి వెళ్లడానికి సిద్దంగా ఉన్నారని, తెలంగాణకు చెందిన వారు ఇప్పటికే తమ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకెళ్లమంటూ అభ్యర్థించినట్టు పేర్కొన్నారు. నెలకు మూడు వందల డాలర్ల వరకు సంపాదించే వారు ప్రస్తుత పరిస్థితుల్లో వంద డాలర్లు కూడా సంపాదించలేక అవస్థలు పడుతున్నారని రామచందర్ అన్నారు. కాగా, ఎర్బిల్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ భారతీయులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఉపాధి కోల్పోయిన భారతీయులకు భోజన సదుపాయాన్ని అందిస్తోంది.

Updated Date - 2020-04-21T22:23:17+05:30 IST