ఆరోగ్యానికి అనుష్క టీ!

ABN , First Publish Date - 2020-05-13T06:16:54+05:30 IST

బాలీవుడ్‌ నటి అనుష్కాశర్మ ఇటీవల 31వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా లైవ్‌ఛాట్‌లో తన ఆరోగ్యరహస్యాలను అభిమానులతో పంచుకున్నారు. తన శీరారాన్ని తీరైన ఆకృతిలో ఉంచటానికి వర్కౌట్ల విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో...

ఆరోగ్యానికి అనుష్క టీ!

బాలీవుడ్‌ నటి అనుష్కాశర్మ ఇటీవల 31వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా లైవ్‌ఛాట్‌లో తన ఆరోగ్యరహస్యాలను అభిమానులతో పంచుకున్నారు. తన శీరారాన్ని తీరైన ఆకృతిలో ఉంచటానికి వర్కౌట్ల విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో ఆహారంపైనా అంతే శ్రద్ధ చూపుతారు. కరోనా నేపథ్యంలో రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారంలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టింగ్‌ ఛాయ్‌ గురించి అనుష్క చెప్పారు. పసుపు, మిరియాలతో ఈ టీని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. 


కావలసినవి: నల్ల మిరియాలు, పసుపు, అల్లం, బెల్లం లేదా తేనె

తయారీ: కొన్ని నల్లమిరియాలను తీసుకొని పొడి చేసుకోవాలి. చిన్న అల్లంముక్కను పేస్ట్‌లా చేసిపెట్టుకోవాలి. నీటిని వేడి చేసుకోని అందులో పసుపు, నల్లమిరియాల పొడి, అల్లంపేస్ట్‌ వేసి కలపాలి. ‘‘తేనె లేదా బెల్లం కలుపుకున్నా ఫరవాలేదు, రుచితో పాటు ఆరోగ్యకరం కూడా’’ అని అనుష్క చెప్పారు.


Read more