ఆలోచనలే మార్గాలు

ABN , First Publish Date - 2020-05-25T05:23:01+05:30 IST

కొత్తకొత్తగా కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అదే సమయంలో అంతకు ముందు లేని ఎన్నో కొత్త శక్తులు మనలో మనకు తెలియకుండానే పుట్టుకొస్తాయి. అవన్నీ, ఆ కొత్తగా వచ్చిపడిన సమస్యల్ని

ఆలోచనలే మార్గాలు

కొత్తకొత్తగా కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అదే సమయంలో అంతకు ముందు లేని ఎన్నో కొత్త శక్తులు  మనలో మనకు తెలియకుండానే పుట్టుకొస్తాయి. అవన్నీ, ఆ కొత్తగా వచ్చిపడిన సమస్యల్ని పరిష్కరించడానికే అనేది వాస్తవం. అయితే ఆ శక్తులు వాటంతట అవే వచ్చిపడతాయని కాదు. ఆ సమస్య గురించి అదే పనిగా ఆలోచించడం వల్లే అవన్నీ అబ్బుతాయి. ఆలోచించడం అంటే పాజిటివ్‌గా ఆలోచించినప్పుడే సుమా! పాజిటివ్‌గా ఆలోచించడం అంటే, మనలోని శక్తి సామర్థ్యాల పైన నమ్మకం ఉంచడమే! గతంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉంటాం.  ఎన్నో సమస్యల్ని పరిష్కరించి ఉంటాం. ఎన్నో అవరోధాల్ని అధిగమించి ఉంటాం. వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటే మనపైన మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం నుంచే పాజిటివ్‌ ఆలోచనలు పుట్టుకొస్తాయి. 


మనపైన మనకు నమ్మకం లేకపోతే, భయం మొదలవుతుంది. భయం మనల్ని శక్తిహీనం చేస్తుంది.  శక్తిహీనమైన  మనిషి సాహసోపేతమైన ఆలోచనలు చేయలేడు. అందుకే పిల్లల్లో ఆ నమ్మకాన్ని అంటే ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయాలి. అది కరోనాయే కాదు. మరే వైరస్‌ వచ్చినా, జీవితంలో మరే సమస్య తలెత్తినా, దాన్ని అధిగ మించే శక్తి వారికి సంక్రమిస్తుంది. ఒక రకంగా ఇవన్నీ పెద్ద వాళ్లకు మాత్రమే చె ప్పే విషయాల్లా అనిపించవచ్చు. కానీ, చిన్న చిన్న మాటల్లో చెబితే, పిల్లలకు కూడా చక్కగా అర్థమవుతాయి. కాకపోతే, ఒకసారి చెప్పి వదిలేయకుండా ఒకటికి నాలుగుసార్లు,  సహనంగా, సావధానంగా చెప్పాలి.

Updated Date - 2020-05-25T05:23:01+05:30 IST