అపోహలు వీడండి!

ABN , First Publish Date - 2020-04-14T05:45:42+05:30 IST

కరోనా వైరస్‌కు సంబంధించి అర్థం లేని అపోహలు సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తూ ఉన్నాయి...

అపోహలు వీడండి!

కరోనా వైరస్‌కు సంబంధించి అర్థం లేని అపోహలు సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తూ ఉన్నాయి. వాటిలో వాస్తవం ఎంత?

అపోహ: హ్యాండ్‌ డ్రయర్స్‌ వైరస్‌ను సమర్థంగా చంపగలవు!

నిజం: హ్యాండ్‌ డ్రయర్స్‌ కరోనాను సంహరించలేవు.

అపోహ: ఈగల ద్వారా కరోనా వ్యాపిస్తుంది!

నిజం: ఈగల ద్వారా కరోనా వ్యాపిస్తుందని నిర్థారించే ఆధారాలు లేవు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు, అతను తాకిన వస్తువులను తాకడం ద్వారా వ్యాఽధి సంక్రమిస్తుంది.

అపోహ: ఎండ సోకితే వైరస్‌ సోకదు!

నిజం: 25 డిగ్రీలకు మించిన ఎండ లేదా ఉష్ణోగ్రతలకు ఎక్స్‌పోజ్‌ అవడం ద్వారా కొవిడ్‌ - 19 నుంచి తప్పించుకోవచ్చు అనేది అవాస్తవం.


Updated Date - 2020-04-14T05:45:42+05:30 IST