‘అడవిరాణి’ ఎందుకు ఆగిపోయింది?

ABN , First Publish Date - 2020-08-16T05:30:00+05:30 IST

తెలుగు, తమిళ భాషల్లో మొదలైన ఈ సినిమా కోసం ప్రకాశ్‌ రాజ్‌, నెపోలియన్‌, శరత్‌ బాబు, రఘువరన్‌, అలీ, విజయకుమార్‌, వడివేలు, ఇంద్రజ, జయంతి వంటి ప్రముఖ నటినటుల్ని ఎంపిక చేశారు...

‘అడవిరాణి’ ఎందుకు ఆగిపోయింది?

తెలుగు, తమిళ భాషల్లో మొదలైన ఈ  సినిమా కోసం ప్రకాశ్‌ రాజ్‌, నెపోలియన్‌, శరత్‌ బాబు, రఘువరన్‌, అలీ, విజయకుమార్‌, వడివేలు, ఇంద్రజ, జయంతి వంటి ప్రముఖ నటినటుల్ని ఎంపిక చేశారు. ఇక సాంకేతిక నిపుణులు కూడా తక్కువ వారేం కాదు. తోటపల్లి మధు మాటలు రాశారు, ఏ.ఆర్‌. రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా   ఎంపిక చేశారు. అడవి నేపథ్యంగా వచ్చిన చాలా చిత్రాలకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.


సినిమా ఫీల్డ్‌ లో హీరోయిన్ల స్పాన్‌ చాలా తక్కువ. హీరోల్లా ఏళ్ళ తరబడి పరిశ్రమలో ఉండే అవకాశం వాళ్లకు ఉండదు. గతంలో హీరోయిన్లు ఐదారేళ్ల వరకూ ఉండేవారు కానీ ఇప్పుడైతే ప్రతి సినిమాకూ ఓ కొత్త హీరోయిన్‌ను వెతుక్కోవలసి వస్తోంది. ప్రేక్షకుల అభిరుచులు క్షణక్షణం మారుతుండడమే దీనికి కారణం. అయితే అందుకు భిన్నంగా సుదీర్ఘకాలం హీరోయిన్‌గా రాణించిన ఘనత ఒక్క విజయశాంతిదే. 


ఆమె తర్వాత ఎంతో మంది కథానాయికలు వచ్చినా విజయశాంతి స్థానం చెక్కు చెదరలేదు. గ్లామర్‌ పాత్రలతో పాటు పెర్ఫార్మన్స్‌ క్యారెక్టర్లు కూడా పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 

ముఖ్యంగా  ‘కర్తవ్యం’  చిత్రం నుండి విజయశాంతి ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది.  ఒక పక్క హీరోయిన్‌, మరో పక్క హీరో.. ఇలా టూ షేడ్స్‌ ఉన్న పాత్రల సృష్టి  మొదలైంది. విజయశాంతి కోసమే ప్రత్యేకంగా కధలు తయారు చేసేవారు. . సినిమాలో  హీరో లేని లోటు తీరుస్తూ విజయశాంతి భారీ యాక్షన్‌ సీన్లు  కూడా చేస్తుండడంతో తమిళ, హిందీ భాషల్లో ఆమెకు డిమాండ్‌ పెరిగింది. ‘పోలీస్‌ లాకప్‌’, ‘లేడీ బాస్‌’, ‘స్ట్రీట్‌ ఫైటర్‌’, ‘మగరాయుడు’  వంటి చిత్రాలు ఆమె క్రేజ్‌కు అద్దం పడతాయి.  ఆ కోవకు చెందిన చిత్రం ‘అడవిరాణి’.   ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌ కథాంశంతో  1994 అక్టోబర్‌ 26న అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విక్టరీ వెంకటేష్‌ పూజ చేసిన అనంతరం విజయశాంతిపై తొలి షాట్‌ తీశారు. మాజీ ప్రధాని  పి.వి.నరసింహారావు తనయుడు, నాటి పి.సి.సి.ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. నిర్మాత కె.దేవివరప్రసాద్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌ ఆశీస్సులతో జయరామరావు ఈ సినిమా ప్రారంభించారు.


తెలుగు, తమిళ భాషల్లో... 

తెలుగు, తమిళ భాషల్లో మొదలైన ఈ  సినిమా కోసం ప్రకాశ్‌ రాజ్‌, నెపోలియన్‌, శరత్‌ బాబు, రఘువరన్‌, అలీ, విజయకుమార్‌, వడివేలు, ఇంద్రజ, జయంతి వంటి ప్రముఖ నటినటుల్ని ఎంపిక చేశారు. ఇక సాంకేతిక నిపుణులు కూడా తక్కువ వారేం కాదు. తోటపల్లి మధు మాటలు రాశారు, ఏ.ఆర్‌. రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా   ఎంపిక చేశారు. అడవి నేపథ్యంగా వచ్చిన చాలా చిత్రాలకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అవి హిట్‌ కావడం వల్ల  ఆ సెంటిమెంట్‌తో  ఆయన్నే ఈ సినిమాకు దర్శకుడిగా ఎన్నుకొన్నారు. 


ఫైనాన్స్‌ ప్రాబ్లమ్‌

ప్రారంభం నుంచి ఈ సినిమాకు కష్టాలే. అతి కష్టం మీద మద్రాసులో ఒక షెడ్యూల్‌, పొల్లాచ్చి మరో షెడ్యూల్‌ చేశారు. ఆఫ్రికాలో ఫారెస్ట్‌ సన్నివేశాలు తీద్దామని ప్లాన్‌ చేశారు. అయితే డబ్బు ఒకటే ప్రధాన సమస్య కావడంతో అడుగు ముందుకు పడలేదు.  ఫైనాన్స్‌ పుట్టక పోవడంతో నిర్మాత జయరామరావు చేతులు ఎత్తేశారు. ‘అడవిరాణి’ ఆగిపోయింది.


Updated Date - 2020-08-16T05:30:00+05:30 IST