వెజ్‌ కట్లెట్‌

ABN , First Publish Date - 2020-05-18T06:47:42+05:30 IST

బీన్స్‌, బంగాళదుంప, క్యారెట్‌లను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటికి బఠాణీలు కలిపి కుక్కర్‌లో వేసి ఉడికించి మెత్తటి గుజ్జులా చేయాలి. పచ్చిమిరప, గరంమసాలా, అల్లంపేస్ట్‌, జీలకర్ర, తరిగిన కొత్తిమీర ఆకులను వేసి బాగా...

వెజ్‌ కట్లెట్‌

కావలసినవి:

  1. బంగాళదుంపలు - 2 పెద్దవి
  2. క్యారెట్‌ - 1
  3. బీన్స్‌ - అరకప్పు
  4. బఠాణీలు - అరకప్పు
  5. అటుకుల పిండి - అరకప్పు 
  6. బియ్యం పిండి - 2 టేబుల్‌ స్పూన్లు 
  7. పచ్చిమిరపకాయలు - 2
  8. గరం మసాలా - అరస్పూను
  9. నూనె, అల్లంపేస్ట్‌, ఉప్పు, జీలకర్ర - తగినంత
  10. తరిగిన కొత్తిమీర


తయారీ: బీన్స్‌, బంగాళదుంప, క్యారెట్‌లను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటికి బఠాణీలు కలిపి కుక్కర్‌లో వేసి ఉడికించి మెత్తటి గుజ్జులా చేయాలి. పచ్చిమిరప, గరంమసాలా, అల్లంపేస్ట్‌, జీలకర్ర, తరిగిన కొత్తిమీర ఆకులను వేసి బాగా కలపాలి. తరువాత అటుకుల పిండిని కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. చేతికి అంటకుండా ఉండేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పిండిని తీసుకొంటూ కట్లెట్స్‌ తయారుచేసుకోవాలి. మరో పాత్రలో బియ్యపు పిండిని తీసుకొని నీళ్లు కలిపి జావ చేయాలి. కట్లెట్స్‌ను కొంచెం తేమ పీల్చుకునేదాకా అందులో ఉంచాలి. బయటకు తీసి అటుకుల పైన ఉంచి అవి రెండు వైపులా అంటుకునేలా చూడాలి. అన్నింటినీ ఇలా చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి సిద్ధంగా ఉన్న కట్లెట్స్‌ను అందులో వేసి వేగించాలి. బంగారం రంగులోకి మారాక రెండోవైపు కూడా ఇలానే వేగించాలి. అంతే రుచికరమైన వెజ్‌కట్లెట్‌ రెడీ. చట్నీతో కలిపి తినొచ్చు. 

Updated Date - 2020-05-18T06:47:42+05:30 IST