పెళ్లి వేడుకలో మెరిసేందుకు!
ABN , First Publish Date - 2020-12-10T06:21:06+05:30 IST
ప్రతి ఏడాది పెళ్లి వేడుకల వేళ కొత్తగా ఫ్యాషన్‌గా ఉండే డిజైన్లు ఆకట్టుకుంటాయి. ఈసారి కూడా పెళ్లి సంబురాల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు బోలెడున్నాయి.

ప్రతి ఏడాది పెళ్లి వేడుకల వేళ కొత్తగా ఫ్యాషన్‌గా ఉండే డిజైన్లు ఆకట్టుకుంటాయి. ఈసారి కూడా పెళ్లి సంబురాల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు బోలెడున్నాయి. చీర, లెహెంగా మీదకు మ్యాంచింగ్‌గా, మంచి లుక్‌నిచ్చే ఈ ట్రెండీ బ్లౌజులతో బంధువులందరిలో మిన్నగా మెరిసిపోండి.
హాఫ్ షోల్డర్ బ్లౌజ్: హాఫ్ షోల్డర్, ట్యూబ్ టాప్స్ ఇష్టపడే వారికి హాఫ్ షోల్డర్ బ్లౌజ్ చక్కగా సరిపోతుంది. లెహెంగా మీదకు లేదా చీర మీదకు డిజైన్డ్ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ మంచి ఎంపిక.
హాఫ్ నెక్ బ్లౌజ్: నలుగురిలో ఆకర్షణగా నిలిచేందుకు లెహెంగా లేదా చీర మీదకు మ్యాచింగ్ హాఫ్ నెక్ బ్లౌజ్ ఎంచుకోవాలి. హెవీ చోకర్ లేదా పెద్ద చెవి రింగులు ధరిస్తే లుక్ అదిరిపోతుంది.
డీప్ వి నెక్ బ్లౌజ్: సింపుల్ లెహెంగా, చీర మీదకు రాళ్లు పొదిగిన, ప్రింటెడ్ బ్లౌజ్ చక్కగా ఉంటుంది. సాయంకాల వేళ జరిగే పెళ్లి వేడుకలో వి నెక్ బ్లౌజ్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్: చేతుల వరకు నిండుగా ఉండే ఈ బ్లౌజ్ ధరించినప్పుడు ఎక్కువగా ఆభరణాలు వేసుకోవాలి. జుంకాలు సింపుల్‌గా ఉన్నా పర్లేదు.
