మాకు పంపండి
ABN , First Publish Date - 2020-12-17T07:03:12+05:30 IST
పండగ నెల వచ్చేసింది. మరోసారి ముగ్గుల సందడి తెచ్చేసింది. ఎప్పటిలానే ఇంటింటా పాఠకుల

పండగ నెల వచ్చేసింది. మరోసారి ముగ్గుల సందడి తెచ్చేసింది. ఎప్పటిలానే ఇంటింటా పాఠకుల వాకిట్లో...ముత్యాల ముగ్గుల హంగామాకు ఆంధ్రజ్యోతి శ్రీకారం చుట్టేసింది. ఈ ముగ్గుల సందడిని మీ ఇంటికే పరిమితం కానివ్వకుండా నలుగురితో పంచుకోండి.
అందుకు మీరు చేయాల్సిందల్లా...
చక్కటి చుక్కల ముగ్గులను స్పష్టంగా తెల్ల కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపడమే!
ముగ్గుకు ఎన్ని చుక్కలు, ఎన్ని వరసలు లాంటి వివరాలను కూడా తెలపండి.
ముగ్గుతో పాటు మీ పాస్పోర్టు సైజు ఫోటో పంపడం తప్పనిసరి.
వెంటనే మీ ముత్యాల ముగ్గులు పంపండి.
మీ పోస్టల్ అడ్రస్, ఫోన్ నంబర్ కూడా వివరంగా రాయండి.
మా చిరునామా... నవ్య, ముత్యాలముగ్గు, ఆంధ్రజ్యోతి కార్యాలయం, రోడ్ నెంబర్ 70, హుడా హైట్స్, జూబ్లీ ిహిల్స్, హైదరాబాద్-500033.
ఈ-మెయిల్:features@andhrajyothy.com