దీపావళి తర్వాత...
ABN , First Publish Date - 2020-09-20T05:30:00+05:30 IST
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆయన క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు షూటింగ్స్ చేయడానికి సిద్ధమవుతున్నారని ముంబై సినీ వర్గాల కథనం...

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆయన క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు షూటింగ్స్ చేయడానికి సిద్ధమవుతున్నారని ముంబై సినీ వర్గాల కథనం. లంగ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత చికిత్సకు అమెరికా వెళ్లాలని అనుకున్నప్పటికీ... ముంబైలోనే కీమోథెరపీ చికిత్స తీసుకున్నారు. ఇటీవలే దుబాయ్‌లో ఉంటున్న భార్య, పిల్లలను కలవడానికి వెళ్లారు. కొన్ని రోజుల్లో ఆయన తిరిగిస్తారని తెలిసింది.
దీపావళి తర్వాత ‘పృథ్వీరాజ్’ చిత్రీకరణ చేస్తారని సమాచారం. అక్షయ్‌కుమార్ హీరోగా చౌహాన్ వంశ రాజ్‌పుత్ రాజు పృథీరాజ్ జీవితాన్ని ఆధారం చేసుకుని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించి దాదాపుగా 90 శాతం చిత్రీకరణ పూర్తయిందట. మరో ఐదారు రోజులు చేస్తే సంజయ్ పాత్ర పూర్తవుతుందట. దీపావళి తర్వాత అది పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.