మేకప్‌ కిట్‌.. శానిటైజ్‌ చేస్తున్నారా!

ABN , First Publish Date - 2020-11-25T05:37:12+05:30 IST

మేకప్‌ మీద ఎంత శ్రద్ధ పెడతామో, మేకప్‌ కిట్‌ పరిశుభ్రత మీద కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. మేకప్‌ బ్రష్‌, లిప్‌స్టిక్‌ అప్లికేటర్‌, ఐ లైనర్‌.. ఇలా మేకప్‌ సామగ్రిని వీలు చిక్కినప్పుడల్లా శుభ్రం చేసుకోవాలి...

మేకప్‌ కిట్‌.. శానిటైజ్‌ చేస్తున్నారా!

మేకప్‌ మీద ఎంత శ్రద్ధ పెడతామో, మేకప్‌ కిట్‌ పరిశుభ్రత మీద కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. మేకప్‌ బ్రష్‌, లిప్‌స్టిక్‌ అప్లికేటర్‌, ఐ లైనర్‌.. ఇలా మేకప్‌ సామగ్రిని వీలు చిక్కినప్పుడల్లా శుభ్రం చేసుకోవాలి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది కాబట్టి వాటిని శానిటైజ్‌ చేసి ఉపయోగించడం అన్ని విధాలా మంచిది. 


స్పాంజి, బ్రషెస్‌: ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌ను స్ర్పే చేసి స్పాంజి, బ్రషెస్‌ను శుభ్రం చేసేశాం అనుకోవద్దు. మేకప్‌ బ్రష్‌లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. మీరు తరచుగా ఉపయోగించే షాంపూతోనే బ్రష్‌, స్పాంజిలను కడగాలి. పూర్తిగా ఆరిన తరువాత వాటిపై శానిటైజర్‌ చల్లి, వైప్స్‌తో తుడవాలి. 

లిపిస్టిక్‌: లిపిస్టిక్‌ రుద్దుకోవడం పూర్తయిన ప్రతిసారి పరిశుభ్రమైన వైప్స్‌తో లిపిస్టిక్‌ హోల్డర్‌ను తుడవాలి. లిప్‌ పెన్సిల్‌ వాడేటప్పుడు కూడా!

మస్కారా వాండ్‌: మిగతా వాటికన్నా కాటుకను శానిటైజ్‌ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మస్కారా వాండ్‌ను ఆల్కహాల్‌ స్ర్పేతో శుభ్రం చేసినప్పుడు, మిగిలిపోయిన ఆల్కహాల్‌ ఉంటే అది కంటి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. దురద, మంట కూడా ఏర్పడుతుంది. ఒకవేళ మస్కారా వాండ్‌తో కరోనా వస్తుందనే భయం ఉంటే దానిని పడేసి, కొత్తది తీసుకోవాలి.

పౌడర్స్‌: ఇవి చాలా వరకు సురక్షితమే. పౌడర్‌ ఫౌండేషన్‌ లేదా బ్లషెస్‌ మీద ఆల్కహాల్‌ ఉన్న స్ర్పేను బాగా దగ్గర నుంచి  స్ర్పే చేయకూడదు. పై పొరను తొలగించి, దూరం నుంచి స్ర్పే చల్లి, ఆరిన తరువాత  మూత పెట్టాలి.

Read more