ఆమెకు వందనం

ABN , First Publish Date - 2020-03-08T05:48:32+05:30 IST

ఆమె... తల్లి. ఆమె... చెల్లి. ఆమె... భార్య. ఆమె... బిడ్డ. ఆమె... ఒకప్పుడు కేవలం గృహిణి. ఆమె... ఇప్పుడు ఇంటికే కాదు, సమాజానికీ ఓ యజమాని.

ఆమెకు వందనం

నేడు  అంతర్జాతీయ మహిళా  దినోత్సవం


ఆమె... తల్లి. ఆమె... చెల్లి.

ఆమె... భార్య. ఆమె... బిడ్డ.

ఆమె... ఒకప్పుడు కేవలం గృహిణి. 

ఆమె... ఇప్పుడు ఇంటికే కాదు, సమాజానికీ ఓ యజమాని.

ఆమె... పురుషాధిక్య ప్రపంచంలో తన పాత్రనూ, ప్రాధాన్యాన్నీ ఎప్పటికప్పుడు పునర్‌ నిర్వచిస్తోంది. 


మగవాళ్ళదే ఆధిపత్యమనే ప్రతి చోటా మూసను బద్దలుకొడుతోంది. ముందడుగు వేస్తోంది. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. వేతనాల్లో వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తోంది. సమానత్వ పోరాటంలో కొత్త బంగారు లోకానికి వేకువ రేకగా పల్లవిస్తోంది. ఆ స్త్రీమూర్తి... నిత్యచైతన్య దీప్తి. నిరంతర మానవ విజయాల స్ఫూర్తి. ఆమె శక్తికి... ఆమె యుక్తికి... ఆమె నేర్పుకు... ఆమె ఓర్పుకు... వందనం. అభివందనం. అభినందనం.


ఇంకా 166 ఏళ్లట!

ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా, ఎంతో అవగాహన కలిగిస్తున్నా లింగ వివక్ష ఇప్పుడిప్పుడే తగ్గేలా కనపడడం లేదు. స్త్రీ పురుష లింగ వేతనాల విషయంలో వ్యత్యాసం పోవడానికి ఇంకా కనీసం మరో శతాబ్ద కాలం పైగా పట్టేలా ఉంది. సరిగ్గా చెప్పాలంటే మరో 166 ఏళ్ళు పడుతుంది. సాక్షాత్తూ, ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ మాట ఇది. 

Updated Date - 2020-03-08T05:48:32+05:30 IST