ఆయన ఆ సంగతి చెప్పొద్దు అన్నారు!
ABN , First Publish Date - 2020-05-24T05:30:00+05:30 IST
‘‘అజయ్ దేవగణ్, టబు జంటగా నటించిన ‘విజయ్‌పథ్’లో ‘రుక్ రుక్...’ పాట ఉంది కదా! ఆ సినిమా పాటలు విడుదలైనప్పుడు నేను చాలా చిన్నదాన్ని. రెండు మూడేళ్లు ఉంటాయేమో!? అప్పుడు ‘రుక్ రుక్’ పాడేదాన్ని...

‘‘అజయ్ దేవగణ్, టబు జంటగా నటించిన ‘విజయ్‌పథ్’లో ‘రుక్ రుక్...’ పాట ఉంది కదా! ఆ సినిమా పాటలు విడుదలైనప్పుడు నేను చాలా చిన్నదాన్ని. రెండు మూడేళ్లు ఉంటాయేమో!? అప్పుడు ‘రుక్ రుక్’ పాడేదాన్ని. ‘దే దే ప్యార్ దే’ చేసేటప్పుడు అదే విషయం అజయ్ దేవగణ్‌కి చెబితే ‘మళ్లీ ఎక్కడా చెప్పొద్దు’ అన్నారు. ‘మన సినిమా కథే ఇదే కదా’ అని నేను చమత్కరించాను’’ అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ‘దే దే ప్యార్ దే’కి సీక్వెల్ చేసే సన్నాహాల్లో ఉన్నామని ఇటీవల నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ ‘‘మనం సీక్వెల్ ఎప్పుడు చేద్దామని దర్శకుడు అఖివ్ అలీకి మెసేజ్‌లు చేస్తుంటా.
వార్తల్లో సీక్వెల్ గురించి చదివి సంతోషించా. ‘దే దే ప్యార్ దే’ బృందంతో కలిసి మళ్లీ పని చేయడానికి ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ప్రస్తుతం హిందీలో జాన్ అబ్రహం ‘ఎటాక్’ సహా అర్జున్ కపూర్ సరసన ఓ చిత్రం, అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నారు రకుల్.