మీరే నాకు ప్రేరణ - హీనా ఖాన్‌

ABN , First Publish Date - 2020-07-19T05:30:00+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా 38వ వసంతంలోకి అడుగుపెట్టారు. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు...

మీరే నాకు ప్రేరణ   - హీనా ఖాన్‌

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా 38వ వసంతంలోకి అడుగుపెట్టారు. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరీనా కపూర్‌ ప్రియాంకతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి విషెస్‌ చెప్పారు. ‘ప్రపంచంలో మీరు ఎందరికో స్ఫూర్తి. దానిని అలాగే కొనసాగించండి’ అని కరీనా కామెంట్‌ చేశారు.


అనుష్క శర్మ, ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్ర, మధుర్‌ భండార్కర్‌ కూడా ప్రియంకకు బర్త్‌డే విషెష్‌ తెలిపారు. హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్‌ హీనాఖాన్‌ కూడా ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది కేన్స్‌ చిత్రోత్సవంలో వీరిద్దరూ ఆడిపాడారు. అప్పటి జ్ఞాపకాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసి ‘చాలా విషయాల్లో మీరు నాకు ప్రేరణ. నాకు మ్యాజిక్‌ మీద నమ్మకం కలిగేలా చేశారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని మ్యాజిక్‌లా ఉంటుంది. మీరు జన్మించిన ఈ స్వర్గానికి ధన్యవాదాలు’ అని హీనా రాసుకొచ్చారు.


Updated Date - 2020-07-19T05:30:00+05:30 IST