ఆన్‌లైన్‌ పూజ... ఇంటికే ప్రసాదం!

ABN , First Publish Date - 2020-05-29T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల ఆలయాలు మూతపడడంతో భక్తులు ఇంట్లో పూజలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆలయాల్లోకి భక్తులను అనుమతించకుండా అర్చక వర్గాలు ఆరాధనలనూ, ఇతర సేవలనూ...

ఆన్‌లైన్‌ పూజ... ఇంటికే ప్రసాదం!

లాక్‌డౌన్‌ వల్ల ఆలయాలు మూతపడడంతో భక్తులు ఇంట్లో పూజలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆలయాల్లోకి భక్తులను అనుమతించకుండా అర్చక వర్గాలు ఆరాధనలనూ, ఇతర సేవలనూ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లోని దేవాలయాలు ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించాయి. కర్ణాటక రాష్ట్రం కూడా ఇదే బాట పడుతోంది. ఈ నెలాఖరుకల్లా ఆ రాష్ట్రంలోని సుమారు పదిహేను జిల్లాల్లో ఉన్న ఆలయాల వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే వివిధ  సేవలను భక్తులు ఆన్‌లైన్‌ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. వారికి ప్రసాదాలను ఇంటికే పంపిస్తారు.


కుక్కి సుబ్రహ్మణ్య ఆలయం, మైసూరు చాముండేశ్వరీ ఆలయం, బెంగళూరు వనశంకరి ఆలయం, సౌందత్తి ఎల్లమ్మ ఆలయం, కతీల్‌ దుర్గా పరమేశ్వరీ ఆలయం... ఇలా అనేక ఆలయాల్లో పూజలను భక్తులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకించి, పూజలు చేయించుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 


Updated Date - 2020-05-29T05:30:00+05:30 IST