బిజీలై్ఫలోనే లైఫ్ ఉంది
ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST
2021ను సినీరంగంలో పూజా హెగ్డే నామ సంవత్సరంగా చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదలకానున్నాయి. ఇటీవల పూజా ‘సర్కస్’ చిత్రం తొలి షెడ్యుల్‌ను పూర్తిచేశారు...

2021ను సినీరంగంలో పూజా హెగ్డే నామ సంవత్సరంగా చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదలకానున్నాయి. ఇటీవల పూజా ‘సర్కస్’ చిత్రం తొలి షెడ్యుల్‌ను పూర్తిచేశారు. అఖిల్ అక్కినేనితో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’, సల్మాన్‌ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాలి’లో నటిస్తున్నారు.
వేర్వేరు చిత్ర పరిశ్రమల్లో నటిస్తూ షూటింగ్స్ కోసం తీరికలేకుండా ముంబై, హైదరాబాద్ మధ్యన తిరుగుతున్నారు పూజా. అయితే నిరంతరం బిజీగా ఉండడం గురించి తానేమీ బాధపడడం లేదంటున్నారు పూజా హెగ్డే. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ‘‘ తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం ద్వారా అభిమానులకు సంతోషం కలిగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వేర్వేరు భాషల్లో నటించడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవడం సాధ్యమవుతుంది. డిసెంబర్ 25 దాకా ‘రాధేశ్యామ్’ షూటింగ్లో పాల్గొంటాను. తర్వాత మళ్లీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ షూటింగ్‌కు వస్తాను. తిరిగి జనవరి 2 నుంచి ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో పాల్గొంటాను. అయితే ఇలా బిజీగా ఉండడం గురించి నాకేం బాధ లేదు. నాకీ అవకాశం దక్కినందుకు కృతజ్ఞతతో ఉంటాను. పనితో బాగా అలసిపోయి బెడ్‌పైకి చేరగానే నిద్రలోకి జారుకోవడం సంతృప్తినిస్తుంది’’ అని బిజీగా ఉండడంలోనే తనకు ఆనందం ఉందని పూజాహెగ్డే చెప్పారు.