గర్భిణులు ఓఆర్ఎస్ తాగొచ్చు!
ABN , First Publish Date - 2020-09-01T05:30:00+05:30 IST
ఉదయం పూట వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు గర్భిణుల్లో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వారికి ఓఆర్ఎస్ ద్రావణం తాగిపించడం ద్వారా డీహైడ్రేషన్‌ను కొంతవరకూ తగ్గించవచ్చు అంటున్నారు గైనకాలజిస్ట్...

ఉదయం పూట వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు గర్భిణుల్లో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వారికి ఓఆర్ఎస్ ద్రావణం తాగిపించడం ద్వారా డీహైడ్రేషన్‌ను కొంతవరకూ తగ్గించవచ్చు అంటున్నారు గైనకాలజిస్ట్ సురభీ సిద్ధార్థ.
‘‘నోరు తడారిపోవడం, తలనొప్పి, దాహం ఎక్కువవడం, మూత్రం ఎక్కువగా రావడం వంటివి డీహైడ్రేషన్‌కు లోనయిప్పుడు కనిపించే లక్షణాలు. అలా జరగకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. ఓఆర్ఎస్ ద్రావణంలో పొటాషియం, సోడియం, చక్కెర, ఇతర ముఖ్యమైన ఎలకో్ట్రలైట్స్ ఉంటాయి. ఓఆర్ఎస్ తాగితే వాంతులు తగ్గిపోతాయి. ఈ ద్రావణం రుచిగా ఉండడంతో పాటు కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తుంది. దీంతో ఏ చెడు ప్రభావం ఉండదు’’ అంటున్నారు సురభి. అయితే సమస్య తీవ్రమయినప్పుడు తప్పకుండా వైద్యనిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారామె.