డెలివరీ బాయ్ కాదు.. డాగ్
ABN , First Publish Date - 2020-07-18T05:30:00+05:30 IST
ఈ కరోనా కాలంలో... ఆన్‌లైన్‌లో బుక్ చేసినా సరే డెలివరీ బాయ్ నుంచి పార్సిల్ తీసుకునేప్పుడు ఒకింత భయం ఉండనే ఉంటుంది. కానీ దక్షిణ అమెరికాలోని కొలంబియాలోని...

ఈ కరోనా కాలంలో... ఆన్‌లైన్‌లో బుక్ చేసినా సరే డెలివరీ బాయ్ నుంచి పార్సిల్ తీసుకునేప్పుడు ఒకింత భయం ఉండనే ఉంటుంది. కానీ దక్షిణ అమెరికాలోని కొలంబియాలోని మెడెల్లిన్ పట్టణంలోని ప్రజలకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ ఒక శునకం ఇంటింటికీ నిత్యావసరాలను చేరవేస్తున్నది. ఆశ్చర్యంగా ఉంది కదూ!
కొండ ప్రాంతమైన మెడెల్లిన్ పట్టణానికి సమీపంలోని టులిపనీ్‌సకు చెందిన ఓ పెద్దమనిషి పెంపుడు కుక్కే ఈ ఎరోస్. లాబ్రడార్ జాతికి చెందిన ఈ కుక్కకు ఇప్పడు ఆరేళ్లు. దాన్ని పెంచుకుంటున్న పెద్దాయన నాలుగేళ్లుగా మెడిల్లిన్ సమీపంలోని టులిపనీ్‌సలో ఒక మార్కెట్ నిర్వహిస్తున్నారు. సరుకుల డోర్ డెలివరీ సమయంలో ఆయన తన వెంట పిల్లలను, అల్లారుమద్దుగా పెంచుకుంటున్న ఎరో్‌సను కూడా తీసుకెళ్లే వారు. దాంతో అక్కడి వీధులు, మనుషులు ఆ శునకానికి బాగా తెలుసు. ఇప్పుడు కొలంబియాలోనూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం తప్పకుండా పాటించాల్సిన రోజులొచ్చాయి. దాంతో కస్టమర్ల ఇంటికి సరుకులు తీసుకెళ్లేందుకు తన పెంపుడు కుక్కను పంపించాలనుకున్నారు పెద్దాయన. ఫుడ్ ఐటెమ్స్, కూరగాయలు, పండ్లను చక్కగా ప్యాక్ చేసి ఒక చిన్న బుట్టలో వేస్తారు. ఆ బుట్టను సదరు కుక్క నోట కరచుకొని కొండ ప్రాంతంలోని వీధులెంట పరుగెడుతూ సరైన అడ్ర్‌సకు వెళ్లి అందిస్తుంది.
అడ్రస్ గుర్తుపడుతుందిలా....
మామూలుగా కుక్క ఇంటి అడ్రస్ గుర్తించలేదు కదా! మరి ఎలా డెలివరీ చేస్తుందంటే... గతంలో తను యజమానితో కలిసి వెళ్లినప్పుడు అభిమానంతో తనకు ఆహారం పెట్టిన వారి ముఖాలను, వారి పేర్లను బాగా జ్ఞాపకం పెట్టుకుందీ కుక్క. పెంచుకున్న పెద్దాయన కూడా ఇళ్లను గుర్తించడంలో దానికి కొంత శిక్షణ ఇచ్చారు. దాంతో ఇప్పుడు తనే వెళ్లి సరుకులు అందజేస్తోంది.