మృత్యువు నుంచి రక్షణ కోసం...

ABN , First Publish Date - 2020-05-01T05:30:00+05:30 IST

మండన మిశ్రునితో శాస్త్రచర్చ నేపథ్యంలో, ఒక రాజు శరీరంలోకి ఆదిశంకరులు ప్రవేశిస్తారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయన శరీరాన్ని తగులబెట్టాలని ఆ రాజ్యపు మంత్రి ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీనృసింహ స్వామిని శంకరులు...

మృత్యువు నుంచి రక్షణ కోసం...

  • ఈ నెల 6న శ్రీనృసింహ జయంతి


మండన మిశ్రునితో శాస్త్రచర్చ నేపథ్యంలో, ఒక రాజు శరీరంలోకి ఆదిశంకరులు ప్రవేశిస్తారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయన శరీరాన్ని తగులబెట్టాలని ఆ రాజ్యపు మంత్రి ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీనృసింహ స్వామిని శంకరులు ప్రార్థిస్తారు. ఆయన దేహం దగ్ధం కాకుండా నారసింహుడు రక్షిస్తాడు. ఆ సందర్భంలో శంకరులు చేసిన ప్రార్థనే ‘శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం’. అన్నమయ్యను కూడా ఆపద నుంచి కాపాడిన కరుణామయుడు నారసింహుడే! భక్తితో కొలిచినవారికి ఆయన కొంగు బంగారం. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని, దుష్ట శిక్షణ చేశాడు. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహ స్వామి భక్తులను మృత్యువు నుంచి కాపాడతాడు.


  • శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం
  • ఉగ్రం వీరం మహావిష్ణుం 
  • జ్వలంతం సర్వతోముఖమ్‌
  • నృసింహం భీషణం భద్రం 
  • మృత్యోర్‌ మృత్యుర్‌ నమామ్యహం

ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందనీ శాస్త్రవచనం. కరోనాతో కల్లోలం అవుతున్నవేళ పెద్దలే కాదు, పిల్లల చేత కూడాఈ మంత్రాన్ని వల్లె వేయిస్తే... అనవసరమైన భయాలు దూరమై, స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలూ కలుగుతాయి. 


Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST