విశ్వపరిణామంలో ‘నేను’

ABN , First Publish Date - 2020-02-28T06:11:39+05:30 IST

తాత్త్వికమైన ప్రయాణంలో మనిషి ‘నేను’ను, అంటే తన ‘ఆత్మత్త్వా’న్ని తెలుసుకోవడం మొదటి అంచెగా పెద్దలు చెబుతారు. ఆత్మవిచారం, స్వీయ అవగాహన ఆధ్యాత్మిక మార్గంలో పురోగమనానికి మార్గదర్శకాలు అవుతాయి. అలాంటి పురోగతి సాధించినవారు...

విశ్వపరిణామంలో ‘నేను’

తాత్త్వికమైన ప్రయాణంలో మనిషి ‘నేను’ను, అంటే తన ‘ఆత్మత్త్వా’న్ని తెలుసుకోవడం మొదటి అంచెగా పెద్దలు చెబుతారు. ఆత్మవిచారం, స్వీయ అవగాహన ఆధ్యాత్మిక మార్గంలో పురోగమనానికి మార్గదర్శకాలు అవుతాయి. అలాంటి పురోగతి సాధించినవారు మార్గదర్శకులు అవుతారు. యోగం, ధ్యానాలను సాధన చేసి, వాటి రహస్యాలను ఆసక్తి కలిగిన వారికి అందించడానికి అనేక రచనలు చేసిన అనుభవం విశ్వర్షి వాసిలి వసంతకుమార్‌కు ఉంది. ‘మాస్టర్‌ యోగ’కు బహుళ ప్రాచుర్యం కల్పించిన సాహితీవేత్త శార్వరి (వాసిలి రామకృష్ణశర్మ) కుమారుడైన వసంతకుమార్‌ తాజాగా రాసిన పుస్తకం ‘నేను’. దీన్ని ‘యౌగిక కావ్యం’గా ఆయన పేర్కొన్నారు.

నిజానికి ఇది ఒక దీర్ఘ కవిత. నేను గురించిన ఈ ‘విశ్వావలోకనం’లో ‘పరిణామ పథం’, ‘ప్రమోద పథం’, ‘ప్రమాణ పథం’, ‘ప్రస్థాన పథం’ అనే నాలుగు విభాగాలు ఉన్నాయి. ‘నేను’లోని అసంఖ్యాకమైన భావ కోణాలను వాసిలి ఈ కావ్యంలో లోతుగా, అత్యంత కవితాత్మకంగా ఆవిష్కరించారు. అణు రూపం మొదలుకొని విశ్వ పరిణామానికీ, మానవ పరిణామానికీ భారతీయ తాత్త్విక చింతనా దృక్పథంతో ఆయన చేసిన విశ్లేషణ ఇందులో చూడవచ్చు.


  • నేను (యౌగిక కావ్యం)
  • రచన: విశ్వర్షి వాసిలి వసంతకుమార్‌
  • ప్రచురణ: యోగాలయ,
  • తిరుమలగిరి, సికింద్రాబాద్‌-500015
  • పేజీలు: 152,  వెల: రూ.150,
  • ప్రతులకు: 9393933946

Updated Date - 2020-02-28T06:11:39+05:30 IST