వైదిక, స్తోత్ర నిధి!
ABN , First Publish Date - 2020-05-08T05:30:00+05:30 IST
వేద మంత్రాల నుంచి దేవతా స్తోత్రాల వరకూ, భగవద్గీత నుంచి శతకాల వరకూ, అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర వాగ్గేయకారుల కీర్తనల నుంచి పతంజలి యోగ సూత్రాల వరకూ అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథాలను...
వేద మంత్రాల నుంచి దేవతా స్తోత్రాల వరకూ, భగవద్గీత నుంచి శతకాల వరకూ, అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర వాగ్గేయకారుల కీర్తనల నుంచి పతంజలి యోగ సూత్రాల వరకూ అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథాలను ‘వైదిక విజ్ఞానం’ వెబ్‌సైట్ అందిస్తోంది. తెలుగుతోపాటు ఆంగ్లం, దేవనాగరి, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ భాషలలో కూడా వందల సంఖ్యలో వేద, స్తోత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం ఇందులో అందుబాటులో ఉంది. ఈ పుస్తకాలను చదువుకోవాలంటే https://vignanam.org అనే లింక్‌ను క్లిక్ చెయ్యండి.