కనురెప్పలపై పూల సోయగం

ABN , First Publish Date - 2020-03-02T06:47:15+05:30 IST

ఐ లైనర్‌తో కనులకే కాదు ముఖానికి కొత్త అందం వస్తుంది. వింగ్డ్‌ ఐ లైనర్‌, గ్లిట్టర్‌ ఐ లైనర్‌, క్యాట్‌ ఐ వంటివి నయా ఫ్యాషన్‌. ఇప్పుడు పూల డిజైన్లతో ...

కనురెప్పలపై పూల సోయగం

ఐ లైనర్‌తో కనులకే కాదు ముఖానికి కొత్త అందం వస్తుంది. వింగ్డ్‌ ఐ లైనర్‌, గ్లిట్టర్‌ ఐ లైనర్‌, క్యాట్‌ ఐ వంటివి నయా ఫ్యాషన్‌. ఇప్పుడు పూల డిజైన్లతో ఉన్న ఐ లైనర్‌  వేసుకోవడం సరికొత్త ట్రెండ్‌. బ్యూటీ నిపుణులు కనురెప్పల మీద రంగురంగుల లిక్విడ్‌ ఐ లైనర్స్‌తో చిన్న చిన్న పూల బొమ్మలు వేస్తూ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌ అవుతోన్న ఫ్లోరల్‌ ఐ లైనర్‌ను మీరూ ప్రయత్నించండిలా..

ట్రెండీగా ఉన్న ఫ్లోరల్‌ ఐ లైనర్‌ వేసుకోవడం అంత కష్టమేం కాదు. ముందుగా కళ్ల మీద ప్రైమర్‌ లేదా ఫౌండేషన్‌ వేసుకోవాలి. ఇప్పుడు చిన్నచిన్న చుక్కలు కలుపుతూ పూల డిజైన్‌ వేయాలి. మసకగా ఆకులను గీయాలి. వంకాయ రంగు, పీచ్‌ పండు రంగు, గులాబీ రంగులను ఎంచుకంటే పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. వైట్‌ ఐ లైనర్‌తో పూల మధ్య భాగాన్ని, గ్రీన్‌ ఐ లైనర్‌తో ఆకులను గీయాలి. ఫ్లోరల్‌ ఐ లైనర్‌కు మరింత ఆకర్షణ తేవాలనుకుంటే పూల డిజైన్‌ కింద మెరుపులీనే ఆకుపచ్చని లైనర్‌తో బార్డర్‌ గీస్తే సరి. చివరగా కళ్లను కాటుకతో సింగారించుకోవాలి.

Updated Date - 2020-03-02T06:47:15+05:30 IST