రమణమ్మా... ఒక్క సెల్ఫీ

ABN , First Publish Date - 2020-07-22T05:30:00+05:30 IST

పాటల ఆల్బమ్స్‌ విడుదల చేయాలంటే ఇదివరకు పెద్ద పెద్ద బ్యానర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా యంగ్‌ టాలెంట్‌కు యూట్యూబ్‌ వేదికైంది. దీంతో ఇప్పుడు వెండి తెరపై నుంచే కాదు...

రమణమ్మా... ఒక్క సెల్ఫీ

పాటల ఆల్బమ్స్‌ విడుదల చేయాలంటే ఇదివరకు పెద్ద పెద్ద బ్యానర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా యంగ్‌ టాలెంట్‌కు యూట్యూబ్‌ వేదికైంది. దీంతో ఇప్పుడు వెండి తెరపై నుంచే కాదు... సామాజిక మాధ్యమాల నుంచి కూడా స్టార్లు పుట్టుకువస్తున్నారు. ఊరూ పేరు లేనివారైనా సరే... కంటెంట్‌ అదిరితే క్షణాల్లో లైకులు లక్షలు దాటుతున్నాయి. అలాంటిదే మరో ఆల్బమ్‌... ‘రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మా...’. నాలుగు రోజుల కిందట ‘లలితా ఆడియో అండ్‌ వీడియో’ ఛానల్‌ ద్వారా అప్‌లోడ్‌ అయిన ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటికి 11 లక్షల మందికి పైగా వీక్షించారు. రామకృష్ణ కండకట్ల రాసిన ఈ పాటను బొడ్డు దిలీప్‌కుమార్‌ ఆలపించగా, డీజే శ్రీకాంత్‌ బాణీ కట్టారు. అనిల్‌, హేమ సినిమాను తలపించేలా అభినయించారు. శివకృష్ణ దర్శకత్వ ప్రతిభ, శివ కెమెరా పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


ఆల్బమ్‌:     రాయే రాయే పిల్లో రమణమ్మ 

గానం:     దిలీప్‌కుమార్‌ 

రచన:     రామకృష్ణ 

దర్శకత్వం:        శివకృష్ణ 

వ్యూస్‌:    11.16 లక్షలు 

Updated Date - 2020-07-22T05:30:00+05:30 IST