నాగరికతకు నిలయం...
ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST
ఉత్తర ఆఫ్రికాలో ఓ అరబిక్ దేశం మొరాకో. టూరిజం అనేది మొరాకోకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఓ పక్క సముద్రం, ఇంకో పక్క ఎత్తయిన మంచు కొండలు, ఎడారి, వీటన్నిటి కంటే ముఖ్యంగా ప్రాచీన సంస్కృతికి చిహ్నంగా నిలిచే నగరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, నోరూరించే ఆహారం మొరాకో...

ఉత్తర ఆఫ్రికాలో ఓ అరబిక్ దేశం మొరాకో. టూరిజం అనేది మొరాకోకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఓ పక్క సముద్రం, ఇంకో పక్క ఎత్తయిన మంచు కొండలు, ఎడారి, వీటన్నిటి కంటే ముఖ్యంగా ప్రాచీన సంస్కృతికి చిహ్నంగా నిలిచే నగరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, నోరూరించే ఆహారం మొరాకో ప్రత్యేకత. యుద్థ సన్నివేశాలు చిత్రీకరించడానికి విశాలమైన ప్రాంతంతో పాటు మట్టితో నిర్మించిన కోటలు, గుర్రాలు, ఒంటెలు.. రాజ్యం సృష్టించడానికి అనువైనవన్నీ మొరాకోలో సమకూర్చడం సులభం. ‘గ్లాడియేటర్’, ‘ప్రిన్సెస్ ఆఫ్ పర్షియా’, ‘సన్ ఆఫ్ గాడ్’, ‘ఎ.డి. : ది బైబిల్ కంటిన్యూస్’, ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ చిత్రాలను మొరాకోలో చిత్రీకరించారు.
ఇప్పుడిప్పుడే భారతీయ దర్శక, నిర్మాతలు మొరాకోపై దృష్టి పెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ‘ఏజెంట్ వినోద్’, ‘జగ్గా జాసూ్స’లో కొంత భాగాన్ని అక్కడే చిత్రీకరించారు. ‘ఏక్ థా టైగర్’లో ‘మాష్ అల్లాహ్..’ పాట మొరాకోలో చిత్రీకరించాలని భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల ముంబైలో సెట్ వేశారు. మొరాకో ప్రజలు హిందీ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారు. మొరాకో దర్శక, నిర్మాతలు తమ చిత్రాల్లో భారతీయ సంస్కృతిని చూపించడానికి ఇష్టపడుతుంటారని అక్కడి చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. తెలుగు చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కూడా మొరాకోలో చిత్రీకరించారు.