మేకప్‌ త్వరగా పూర్తవుతుందిలా!

ABN , First Publish Date - 2020-10-19T05:37:23+05:30 IST

ఆఫీసుకు వెళ్లే హడావిడిలో మేకప్‌ వేసుకోవడానికి ఎక్కువ సమయం దొరకదు. అలాంటప్పుడు తక్కువ

మేకప్‌ త్వరగా పూర్తవుతుందిలా!

ఆఫీసుకు వెళ్లే హడావిడిలో మేకప్‌ వేసుకోవడానికి ఎక్కువ సమయం దొరకదు. అలాంటప్పుడు తక్కువ సమయంలోనే మేకప్‌ పూర్తవ్వాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 


అవేమిటంటే... 

మల్టీ టాస్కింగ్‌ మాయిశ్చరైజర్‌: ఒకే మాయిశ్చరైజర్‌ మూడు బ్యూటీ ఉత్పత్తులుగా పనిచేస్తుంది. చర్మానికి తేమను అందించడం, సూర్యరశ్మి నుంచి రక్షణ ఇవ్వడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడం.. ఇలా మూడు విధాలుగా ఉపయోగపడే మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. విటమిన్‌ ఎ ఉన్న మాయిశ్చరైజర్‌ చర్మంపై ముడతలు, గీతలను మాయం చేస్తుంది.

కన్‌సీలర్‌: మఖం మీది మచ్చలను కప్పివేసేందుకే ఎక్కువ సమయం పడుతుంది. అయితే ముందుగా కన్‌సీలర్‌తో కళ్ల కింది మచ్చలను కవర్‌ చేయాలి. కొద్దిసేపటి తరువాత మేకప్‌ వేసుకోవాలి. ఆలోగా కన్‌సీలర్‌ను చర్మం గ్రహించి మృదువుగా మారుతుంది.  

కళ్లు కళగా: ఐ లైనర్‌, కనుబొమలు, కనురెప్పలు... ఈ మూడింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్రష్‌తో కనుబొమలను  చక్కగా దిద్దుకోవాలి. పై కనురెప్పలను లైనింగ్‌ చేసుకోవాలి. తరువాత కనురెప్పల మీదుగా కాటుక రుద్దుకోవాలి. 

గోళ్లు:  మెనిక్యూర్‌ చేసుకునేందుకు సమయం లేనప్పుడు బఫ్ఫింగ్‌ చేసుకోవాలి. దీంతో గోళ్లు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తాయి. ఆ తరువాత హ్యాండ్‌ క్రీమ్‌ రాసుకోవాలి.


Updated Date - 2020-10-19T05:37:23+05:30 IST