కల్కికొచ్లిన్ గోల్డ్‌ఫిష్
ABN , First Publish Date - 2020-12-06T05:30:00+05:30 IST
బాలీవుడ్ కథానాయిక కల్కికొచ్లిన్, సీనియర్ నటి నీనాగుప్తాలు తొలిసారి తె రను పంచుకోనున్నారు. ‘గోల్డ్‌ఫిష్’ అనే ఓ ఇంటర్నేషనల్ మూవీ చేయబోతున్నారు.

బాలీవుడ్ కథానాయిక కల్కికొచ్లిన్, సీనియర్ నటి నీనాగుప్తాలు తొలిసారి తె రను పంచుకోనున్నారు. ‘గోల్డ్‌ఫిష్’ అనే ఓ ఇంటర్నేషనల్ మూవీ చేయబోతున్నారు. ఆ విషయాన్ని వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘‘నేను ఎంతగానో అభిమానించే నటి నీనాగుప్తాతో కలసి నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లో పాల్గొందామా అనిపిస్తోంది’ అని కల్కికొచ్లిన్ చెప్పారు. నీనా, కల్కిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు పుషన్ కృపాలానీ స్ర్కిప్ట్ సిద్ధం చేశారట. మతిస్థిమితం కోల్పోయిన తల్లి పాత్రలో నీనాగుప్తా, కోలుకోవడానికి తల్లికి సాయపడే కూతురు పాత్రలో కల్కి నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.