కరోనా హడావుడే!
ABN , First Publish Date - 2020-03-25T06:25:27+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తృతమై లక్షలాది మంది దీని బారిన పడగా, వేలాది మంది మరణించారు. మన దేశంలోనే 500లకుపైగా కేసులు నమోద య్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో...

సర్వేలో 42 శాతం వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తృతమై లక్షలాది మంది దీని బారిన పడగా, వేలాది మంది మరణించారు. మన దేశంలోనే 500లకుపైగా కేసులు నమోద య్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఇది వేలు, లక్షలకు చేరవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఒకపక్క ఇంత జరుగుతున్నా 42 శాతం మంది భారతీయులు దీనిని అనవసర రాద్ధాంతంగా భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన 20,000 మందికి పైగా ప్రజలను ‘ఐఎఎన్‌ఎస్ సి వోటర్-గ్యాల్లప్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కరోనా ట్రాకర్-1’ సర్వే చేసింది. ‘కరోనా ముప్పును మీరు అతిశయోక్తిగానే భావిస్తున్నారా?’ అనే వ్యాఖ్యను 42 శాతం మంది భారతీయులు ‘అవును’ అనే సమాధానం ఇచ్చారు. మరో 12 శాతం ‘కావచ్చు’ అని భావించారు. మరో 35 శాతం ఈ వ్యాఖ్యతో విభేదించి ఇది పెను ప్రమాదం అని అంగీకరించారు.
వేల మంది మరణించిన ఇటలీలో కూడా 29 శాతం, పాకిస్థాన్‌లో 62 శాతం, ఫ్రాన్స్‌లో 17 శాతం, యూకేలో 26 శాతం, యుఎస్‌లో 55 శాతం మంది ప్రజలు ఇలాంటి అభిప్రాయంలోనే ఉన్నారు. కాగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకుపైగా కరోనాబారిన పడగా, 17 వేల మంది మరణించారు. ఇప్పటి వరకు భారత్‌లో 500లపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, తొమ్మిది మంది మరణించారు.