‘లాంగ్‌ ట్రిప్‌’కు వెళ్తున్నారా?

ABN , First Publish Date - 2020-11-22T16:20:24+05:30 IST

కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితమైన వారంతా బోర్‌ కొట్టి ఇప్పుడిప్పుడే బయటకు వెళ్లాలనుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో

‘లాంగ్‌ ట్రిప్‌’కు వెళ్తున్నారా?

కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితమైన వారంతా బోర్‌ కొట్టి ఇప్పుడిప్పుడే బయటకు వెళ్లాలనుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో, లాంగ్‌ రోడ్‌ ట్రిప్స్‌ వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాంగ్‌ట్రిప్‌ వేయాలనుకునే వారు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు రోడ్డు ట్రిప్‌ నిపుణులు. అవేమిటంటే...


కరోనా సమయంలో ఒక ట్రిప్‌ను మునుపటిలా ఇష్టమొచ్చినట్టు ప్లాన్‌ చేసుకోకుండా ఖచ్చితమైన గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎంట్రీ నియమ నిబంధనలు వేరు వేరుగా ఉంటాయి. ఫీవర్‌ స్ర్కీనింగ్‌ గైడ్‌లైన్స్‌, ఈ- పాస్‌లు, క్వారంటైన్‌ నియమాలను కూడా తెలుసుకోవాలి. లేదంటే అక్కడిదాకా వెళ్లిన తర్వాత ఇబ్బంది పడతారు. 


మాస్క్‌లు, శానిటైజర్‌, డిస్పోజబుల్‌ గ్లోవ్స్‌, ఫేస్‌ షీల్డ్‌ తప్పనిసరి. రోడ్డువారగా ఉండే మోటార్‌ మెకానిక్‌ షాప్స్‌లోకి, పెట్రోల్‌ బంకుల్లోకి వెళ్లే ముందు అవి సురక్షిత విధానాలను పాటిస్తున్నాయో లేదో చూడాలి. 

ఎక్కడైనా రెస్ట్‌రూమ్స్‌కు వెళ్లాల్సివస్తే వాటిని శానిటైజ్‌ చేశారా లేదా చూడాలి.   

Read more