ఇంటిపట్టునే వ్యాయామం!
ABN , First Publish Date - 2020-03-16T05:52:36+05:30 IST
వేసవిలో బరువు తగ్గడం తేలిక. కాబట్టి ఈ కాలాన్ని శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి...
వేసవిలో బరువు తగ్గడం తేలిక. కాబట్టి ఈ కాలాన్ని శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇందుకోసం జిమ్‌కు వెళ్లలేని వారు ఇంట్లోనే కొవ్వు కరిగించే వ్యాయామాలు చేసుకోవచ్చు.
కాంబో వర్కవుట్!
హై నీస్: కాళ్ల మధ్య అడుగు దూరం ఉండేలా నిలబడాలి. మోకాళ్లను మడిచి నడుము దగ్గరకు మార్చి, మార్చి లేపుతూ ఉండాలి. ఇలా కాళ్లను లేపినప్పుడు చేతులతో మోకాళ్లను తాకుతూ ఉండాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి.
బర్ఫీ: రెండు చేతులు గాల్లోకి లేపి ఎగరాలి. వెంటనే ముందుకు నేల మీద పడుకోవాలి. ఆలస్యం చేయకుండా లేచి నిలబడి మళ్లీ గాల్లోకి లేవాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి.
మౌంటెయిన్ క్లైంబ్: చేతులు, పాదాల ఆసరాతో నేల మీద బోర్లా పడుకోవాలి. ఈ భంగిమలో మిగతా శరీరం నేలను తాకకూడదు. ఈ భంగిమలో ఉండి, పర్వతం ఎక్కుతున్నట్టుగా కాళ్లను నడుము దగ్గరకు, కిందకూ మార్చి, మార్చి కదిలించాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి.
ప్లాంక్: మోచేతులు, పాదాల ఆసరాతో నేల మీద బోర్లా పడుకోవాలి. ఈ భంగిమలో మిగతా శరీరం నేలను తాకకూడదు. ఇలా 30 సెకండ్లు ఉండాలి.
ఈ వ్యాయామాలు 3 సెట్లు చేయాలి.