ఆశల రాదారిలో... పునరుత్థానం

ABN , First Publish Date - 2020-04-12T05:32:48+05:30 IST

ఇవాళ ఆదివారం... ఈస్టర్‌ ఆదివారం... శిలువ మీది క్రీస్తు సజీవుడై, ప్రాణికోటి కోసం పునరుత్థానం చెందిన రోజు! అజ్ఞానపు అంధకారం నుంచి... చుట్టూ నెలకొన్న...

ఆశల రాదారిలో...  పునరుత్థానం

ఇవాళ ఆదివారం... ఈస్టర్‌ ఆదివారం... శిలువ మీది క్రీస్తు సజీవుడై, ప్రాణికోటి కోసం పునరుత్థానం చెందిన రోజు! అజ్ఞానపు అంధకారం నుంచి... చుట్టూ నెలకొన్న ఆందోళన పూరిత వాతావరణం నుంచి... ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి నుంచి... పట్టుదలతో, విశ్వాసంతో, శాస్త్రీయ దృక్పథంతో మనిషి మళ్ళీ పైకి లేచి రావాల్సిన తరుణమూ ఇదే! పరిశుభ్రత... ముఖానికి మాస్కు... ఇంటికే పరిమితం... ప్రతి ఒక్కరితో భౌతిక దూరం... ఇవన్నీ అందుకే!


ప్రపంచానికి లాక్‌డౌనే శరణ్యమైన పరిస్థితుల్లో... ఇటలీలోని వాటికన్‌ సిటీలో క్యాథలిక్కుల మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ శిలువను ఎత్తుకొన్నా... చెన్నపట్టణంలో చర్చి బయట భక్తులు ఆర్తితో దైవాన్ని ప్రార్థిస్తున్నా... వాటి పరమావధి ఆ పునరుత్థానమే! కూలి కోసం... కూటి కోసం... భయంతో, బెంగతో... దిక్కుతోచక దారితప్పిన గొర్రెపిల్లను ఆకలి, శోకం, భయం లేని నవీన ప్రపంచానికి నడిపించే కాపరి మనలోనే ఉన్నాడు. తానే మనమై ఉన్నాడు. అన్ని కష్టాల్లోనూ ఆశావాదమే పునరుత్థాన మార్గం!!

Updated Date - 2020-04-12T05:32:48+05:30 IST