జిల్లాల వారీగా కరోనా ట్రాకర్
ABN , First Publish Date - 2020-03-25T06:23:42+05:30 IST
జిల్లాల వారీగా కరోనా బాధితులు ఉన్న ప్రాంతాలను తెలుసుకునేందుకు వీలుగా ఒక ట్రాకర్‌ను హైదరాబాద్‌లోని ‘మహీంద్రా ఎకోలే సెంట్రలె’ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించారు.

జిల్లాల వారీగా కరోనా బాధితులు ఉన్న ప్రాంతాలను తెలుసుకునేందుకు వీలుగా ఒక ట్రాకర్‌ను హైదరాబాద్‌లోని ‘మహీంద్రా ఎకోలే సెంట్రలె’ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ సమాచారాన్ని https://covindia.netlify.com నుంచి పొందవచ్చు. వైరస్ జోన్లను గుర్తించి ప్రజలు ఆ వైపు వెళ్ళకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ యాప్‌ను వేసుకోవచ్చు. యాప్‌లోని సమాచారం అంతా ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ, పేరున్న వార్తా సంస్థల నుంచి ేసకరించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు.