కూల్‌ కాటన్స్‌!

ABN , First Publish Date - 2020-03-13T07:02:01+05:30 IST

కాటన్‌ దుస్తులు అనగానే చుడీదార్లు, చీరలే కళ్ల ముందు మెదులుతాయి. కానీ వీటికన్నా వినూత్నంగా..

కూల్‌ కాటన్స్‌!

కాటన్‌ దుస్తులు అనగానే చుడీదార్లు, చీరలే కళ్ల ముందు మెదులుతాయి. కానీ  వీటికన్నా వినూత్నంగా కనిపించే గౌన్స్‌, ఫ్రాక్స్‌ కూడా ఉంటాయి. అమ్మాయిలు వాటితో కూడా సమ్మర్‌లో  కూల్‌గా, స్టయిల్‌గా కనిపించవచ్చు. 


స్ట్రయిప్స్‌ ట్రెండీ లుక్‌ తెచ్చిపెడతాయి. కాబట్టి పువ్వులు కాకుండా, గీతల డిజైన్లు ఉన్న వాటిని నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.


నడుము దగ్గర ఎలాస్టిక్‌ కలిగి ఉండి, జేబులు కుట్టి ఉండే లాంగ్‌ గౌన్స్‌ ట్రెండీగా ఉంటాయి. ఈవినింగ్‌ హ్యాంగవుట్స్‌కు ఈ గౌన్‌ సరైన ఎంపిక!


కలంకారీ డిజైన్లు కలిగిన లాంగ్‌ కాటన్‌ గౌన్స్‌ చూడముచ్చటగా ఉంటాయి. తేలికగా ఉండడంతో పాటు, ఫ్యాషన్‌గా కనిపించాలంటే ఇలాంటి లాంగ్‌ గౌన్స్‌ ఎంచుకోవాలి.

Updated Date - 2020-03-13T07:02:01+05:30 IST