కూరగాయలు కొంటున్నారా!

ABN , First Publish Date - 2020-10-03T05:30:00+05:30 IST

కూరగాయలు కొంటున్నారా!

కూరగాయలు కొంటున్నారా!

అల్లం మరీ గట్టిగా లేదా మెత్తగా  ఉండకుండా ముదురు రంగులో ఉండేది చూసి కొనాలి.


బంగాళాదుంపలపై నల్లటి లేదా ఆకుపచ్చని మచ్చలు ఉంటే కొనొద్దు.  గుంటలు లేకుండా నున్నగా ఉన్న వాటినే కొనాలి.


వంకాయలు ముడతలు పడకుండా ఉండాలి. అవి మరీ గట్టిగా, ముదురుగా ఉండకూడదు. వంకాయల తొడిమి ఆకుపచ్చరంగులో, తోలు నిగ నిగ లాడుతూ ఉండాలి.


ఉల్లిపాయ పొరలో తేమ ఉంటే  కొనొద్దు.


లేత క్యారెట్‌ కొనాలి. లేదా మంచి ఆకారంలో ఉన్న వాటిని కొనాలి.


బీట్‌రూట్‌ కొనేముందు దాని కొంద భాగంలో వేర్లు ఉన్న వాటిని ప్రత్యేకంగా తీసుకోవాలి.


ఆకుకూరలు కొనేటప్పుడు వాటి మీద తెల్లమచ్చలు లేకుండా చూసుకోవాలి. కాడలు తాజాగా, లేతగా ఉన్న వాటినే కొనాలి. 


కాలిఫ్లవర్‌ ఆకులు ఆకుపచ్చని రంగులో ఉంటేనే కొనాలి. పువ్వు విడిపోకుండా దగ్గరగా ఉందా లేదా! గమనించి, దగ్గరగా ఉన్న పువ్వునే తీసుకోవాలి.

Updated Date - 2020-10-03T05:30:00+05:30 IST