హెల్త్‌కేర్‌లోకి ‘బిగ్‌ బీ’ మనవరాలు!

ABN , First Publish Date - 2020-05-17T09:06:31+05:30 IST

బిగ్‌ బీ అమితాబ్‌ ముద్దుల మనవరాలు నవ్యా నవేలీ నందా అప్పుడే ఎంట్రప్రెన్యూర్‌గా మారింది. న్యూయార్క్‌లోని ‘ఫర్‌ధమ్‌’ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన మరుసటి వారానికే ఆమె

హెల్త్‌కేర్‌లోకి ‘బిగ్‌ బీ’ మనవరాలు!

బిగ్‌ బీ అమితాబ్‌ ముద్దుల మనవరాలు నవ్యా నవేలీ నందా అప్పుడే ఎంట్రప్రెన్యూర్‌గా మారింది. న్యూయార్క్‌లోని ‘ఫర్‌ధమ్‌’ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన మరుసటి వారానికే ఆమె ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ రంగంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితులైన అహిల్యా మెహతా, మల్లికా సహానే, ప్రజ్ఞా సాబూలతో కలిసి ‘ఆరా హెల్త్‌’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ‘ఎంపవర్‌, ఎడ్యుకేట్‌, డయాగ్నోస్‌’ అనే నినాదంతో మహిళలకు సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందించాలనేది వీరి ప్రయత్నం. ‘‘ఇది మహిళలకు వర్చ్యువల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌’ అంటూ ‘ఆరా హెల్త్‌’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పేర్కొంది. ఈ సందర్భంగా ఈ యువ వ్యాపారవేత్తకు ఆమె మేనమామ అభిషేక్‌ బచ్చన్‌ అభినందనలు తెలిపారు.


అమితాబ్‌ కూతురు శ్వేతా బచ్చన్‌ నందా కూతురైన నవ్య తన తండ్రి నిఖిల్‌ నందాలాగే వ్యాపారవేత్త కావాలనుకుంటోంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన నవ్య నల్లకోటు, టోపీ ధరించి మే 6న గ్రాడ్యుయేషన్‌ వేడుకను ఇంట్లోనే జరుపుకుంది. ఈ ముచ్చటను ఆమె తల్లి శ్వేతా బచ్చన్‌ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘చార్ట్‌పేపర్‌తో తయారుచేసిన టోపీ, చేతితో కుట్టిన గౌను, యూనివర్శిటీ స్వెట్‌షర్ట్‌ ధరించి గ్రాడ్యుయేట్‌గా మారింది’’ అంటూ ఆమె నవ్య వీడియోను పెట్టారు. ఆ వీడియోను అమితాబ్‌ కూడా షేర్‌ చేస్తూ, మనవరాలిని మెచ్చుకున్నారు.   

Updated Date - 2020-05-17T09:06:31+05:30 IST